రంగారెడ్డి జిల్లా చేవెళ్ల గ్రామ సర్పంచ్ బండారు శైలజా ఆగిరెడ్డి తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు చక్కటి వెంకటేశ్ యాదవ్ నియామక ధ్రువపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు రవీందర్ గౌడ్, మండలంలోని పలు గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ఎంపిక చేయడం ఆనందంగా ఉందని శైలజా ఆగిరెడ్డి పేర్కొన్నారు.