అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి సజీవ దహనంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెవెన్యూ ఉద్యోగులలో భయాందోళన నేటికి కొనసాగుతుంది. తామెంతో కష్టపడి పనిచేస్తూ రైతుల పట్టా పాసు పుస్తకాలు, రైతు బంధు వంటివి సకాలంలో అందించేందుకు కృషి చేస్తున్నామని... కోర్టుల్లో పెండింగ్లో ఉన్న భూవివాదల కేసులు, సాంకేతిక సమస్యలు వల్ల ఇబ్బందులున్నాయని.. రైతులు మాత్రం మేము పనిచేయకపోవటం వల్లే పాసుపుస్తుకాలు రావటంలేదన్న అపోహలో ఉంటున్నారని వారు పేర్కొన్నారు.
రైతులు అధికారులపై కోపోద్రిక్తులై సిబ్బందిపై దాడులకు దిగుతున్నారని వెల్లడించారు. అకారణంగా క్షణికావేశంతో అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించడం, భౌతికదాడులకు దిగడం వంటి చర్యలు మంచివి కావని.. తమ బాధలను అర్థం చేసుకొని రైతులను సముదాయించి భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ రెవెన్యూ అధికారులు లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.
ఇవీ చూడండి: ఆ అధికారిపై విద్యార్థి దాడి చేశాడు ఎందుకు..?