ETV Bharat / state

వైభవోపేతంగా శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు - minister harish rao at statue of equality

Statue of Equality Inauguration Celebrations : భక్తులు, వేద పండితుల శ్రీమన్నారాయణ నామస్మరణతో మొదలైన శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకలు రెండో రోజు కొనసాగుతున్నాయి. శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా అగ్నిమథనం పూర్తి అయింది. ఇవాళ మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్ ముచ్చింతల్​కు వెళ్లనున్నారు. మరోవైపు ఈ నెల 5న ప్రధాని మోదీ.. వస్తున్నందున శ్రీరామనగరంలోని జీవా ప్రాంగణంలో అధికారులు హెలికాప్టర్ ట్రయల్స్ నిర్వహించారు.

Statue of Equality Inauguration Celebrations

author img

By

Published : Feb 3, 2022, 9:57 AM IST

Updated : Feb 3, 2022, 5:04 PM IST

రామానుజ సహస్రాబ్ధి ఉత్సవాల్లో పూర్తైన అగ్నిమథనం

Statue of Equality Inauguration Celebrations : సమతామూర్తి శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది వేడుకలు హైదరాబాద్‌ శివారు ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో వైభవంగా జరుగుతున్నాయి. 12 రోజుల ఈ మహాక్రతువులో తొలిరోజు ఆరాధన శోభాయమానంగా జరిగింది. రెండో రోజు ఉత్సవాలు కన్నులపండువగా ప్రారంభమయ్యాయి.

Statue of Equality Inauguration Celebrations Second day : శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా అగ్నిమథనం పూర్తి అయింది. రెండో రోజు శ్రీ లక్ష్మీ నారాయణ మహా క్రతువులో భాగంగా శమి, రావి కర్రలతో అగ్ని మథనం చేశారు. మంత్ర పూర్వకంగా శమి, రావి కర్రలను పెరుగు చిలికినట్లు చిలుకుతూ వచ్చిన అగ్నిని కుండలాల్లో పోసి హోమాన్ని నిర్వహిస్తున్నారు. భక్తులు భగవన్నామస్మరణ చేస్తుంటే రెండు కర్రల రాపిడికి పట్టిన అగ్నిని 1035 కుండలాల్లో పోశారు. ఏకకాలంలో 5 వేల మంది రుత్వికులతో 1035 కుండలాల్లో హోమాలు నిర్వహిస్తున్నారు. ప్రవచన శాలలో వేద పండితుల ప్రవచన పారాయణం జరుగుతోంది.

Statue of Equality : శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు పరిశీలించారు. కరోనా నిబంధనలు అమలవుతున్నాయో లేదో చూశారు. మరోవైపు.. ఎల్లుండి ప్రధాని పర్యటన ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్షించారు. వివిధ శాఖల ఉన్నతాధికారులతో పాటు డీజీపీ, పోలీసు ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ప్రధాని పర్యటన ఏర్పాట్లపై చర్చించారు.

ముచ్చింతల్​కు కేసీఆర్..

CM KCR to Visit Muchintal : ఇవాళ మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్ ముచ్చింతల్‌కు వెళ్లనున్నారు. శ్రీలక్ష్మీనారాయణ మహాయాగంలో పాల్గొననున్నారు. ఈనెల 5న సహస్రాబ్ది వేడుకలకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఈ క్రమంలో ముచ్చింతల్​లో భద్రతను కట్టుదిట్టం చేశారు. జీవా ప్రాంగణంలో అధికారులు హెలికాప్టర్ ట్రయల్స్ నిర్వహించారు.

మోదీ రాక కోసం సిబ్బంది ట్రయల్​రన్​..

PM Modi visit to Muchintal: సమతామూర్తి శ్రీరామానుజాచార్యుల 216 అడుగుల భారీ విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 5న లోకార్పణం చేయనున్నారు. ఇందుకోసం ముందస్తుగా మచ్చింతల్​లోని యాగశాల సమీపంలో ప్రత్యేక హెలిపాడ్ సిద్ధం చేశారు. ప్రధాని సందర్శించే యాగశాల, సమతామూర్తి కేంద్రం పరిసరాల్లో భద్రతా సిబ్బంది హెలికాప్టర్​తో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో దిగాక హెలికాప్టర్​లో ప్రధాని ముచ్చింతల్ చేరుకోనున్నారు. హెలిపాడ్​లో దిగకముందే సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని విహంగ వీక్షణం చేస్తారు. ఇందుకోసం కేంద్ర బృందం ముమ్మరంగా ట్రయల్​రన్ నిర్వహిస్తోంది. ఇప్పటికే కేంద్ర బలగాలు సమతామూర్తి ప్రాంగణాన్ని ఆధీనంలోకి తీసుకున్నాయి. ఎస్పీజీ డీఐజీ నవనీత్ కుమార్ మెహతా ఆధ్వర్యంలో ప్రతి ప్రాంతాన్ని సిబ్బంది ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

సంబంధిత కథనాలు :

Last Updated : Feb 3, 2022, 5:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.