రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో కారు స్పీడు పెంచి అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది. రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్ పురపాలిక తెరాస సొంతమైంది. షాద్‌నగర్ మున్సిపాలిటీలో అత్యధిక వార్డుల్లో గులాబీ పార్టీ గెలుపొందింది.
వార్డులవారీగా గెలిచిన అభ్యర్థుల వివరాలు
వార్డులు | గెలిచిన అభ్యర్థి | పార్టీ |
1వ వార్డు | మహ్మద్ గౌస్ | ఎంఐఎం |
2వ వార్డు | చెట్ల పావని | తెరాస |
3వ వార్డు | రాయికల్ శ్రీనివాస్ | కాంగ్రెస్ |
4వ వార్డు | అల్లోనిపల్లి శ్రీనివాస్ | తెరాస |
5వ వార్డు | ఎస్.కృష్ణవేణి | తెరాస |
6వ వార్డు | పులిమామిడి లతాశ్రీ | ఇతరులు |
7వ వార్డు | సలేంద్రం రాజేశ్వర్ | తెరాస |
8వ వార్డు | శాంతమ్మ | కాంగ్రెస్ |
9వ వార్డు | తొండపల్లి ప్రతాప్‌రెడ్డి | తెరాస |
10వ వార్డు | కావలి శ్రావణి | ఇతరులు |
11వ వార్డు | పిల్లి శారద | తెరాస |
12వ వార్డు | ఆకుల చంద్రకళ | ఇతరులు |
13వ వార్డు | కానుగు అనంతయ్య | తెరాస |
14వ వార్డు | బి.నర్సింహులు | తెరాస |
15వ వార్డు | ఎమ్.మానస | తెరాస |
16వ వార్డు | ఎమ్.నటరాజన్ | తెరాస |
17వ వార్డు | మహమ్మద్ సర్వర్ పాషా | ఇతరులు |
18వ వార్డు | ఎం.ప్రేమలత | తెరాస |
19వ వార్డు | అరిఫా బేగం మహ్మద్ | ఇతరులు |
20వ వార్డు | కొందూటి మహేశ్వరి | తెరాస |
21వ వార్డు | గోపాలపురం తెలుగు శ్రీనివాస్ | తెరాస |
22వ వార్డు | ఎన్.సరిత | ఇతరులు |
23వ వార్డు | అగ్గనూరు విశాల | తెరాస |
24వ వార్డు | రేటికల్ నందీశ్వర్ | తెరాస |
25వ వార్డు | జి.మాధురి | తెరాస |
26వ వార్డు | ఈగ వెంకట్రామ్‌రెడ్డి | తెరాస |
27వ వార్డు | కె.కౌశల్య | తెరాస |
28వ వార్డు | కొందుటి నరేందర్ | తెరాస |
మొత్తం 28 వార్డుల్లో 19 స్థానాల్లో గులాబీజెండా రెపరెపలాడింది. 2 స్థానాల్లో కాంగ్రెస్, ఒక స్థానంలో ఎంఐఎం, 6 వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. షాద్‌నగర్ పురపాలిక పరిధిలో తెరాస కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు.