ETV Bharat / state

రమాదేవి పబ్లిక్​ స్కూల్​లో సైన్స్​ ఎక్స్​ఫ్లోరా పేరుతో వైజ్ఞానిక ప్రదర్శన..

Science XFlora At Ramadevi Public School: అబ్దుల్లాపూర్​మెట్​లోని రమాదేవి పబ్లిక్​ స్కూల్​లో సైన్స్​ఎక్స్​ఫ్లోరా అనే పేరుతో వైజ్ఞానిక ప్రదర్శనను ఘనంగా నిర్వహించారు. ఈ సైన్స్​ఫైర్​ కార్యక్రమాన్ని ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి ప్రారంభించారు. సుమారు ఈ ప్రదర్శనలో 600 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

Science
Science
author img

By

Published : Nov 7, 2022, 5:52 PM IST

Updated : Nov 8, 2022, 9:17 AM IST

రమాదేవి పబ్లిక్​ స్కూల్​లో సైన్స్​ ఎక్స్​ఫ్లోరా పేరుతో వైజ్ఞానిక ప్రదర్శన..

Science XFlora At Ramadevi Public School: మట్టి లేకుండా తక్కువ నీటితో మొక్కల పెంపకం.. సెన్సర్ల సాయంతో అంధులకు దారి చూపే చేతి కర్ర.. అంతరిక్షంలో ఉండే శకలాలను తొలగించే హైడ్రాలిక్‌ ర్యాంప్‌ పంపు.. ఇంటిని దొంగల నుంచి కాపాడే హైటెక్‌ లేజర్‌ భద్రతా వ్యవస్థ.. ఇలా పదుల సంఖ్యలో వైజ్ఞానిక ప్రాజెక్టులు కొలువుదీరాయి. చిట్టి బుర్రల్లో చిగురించిన ఆలోచనలు అద్భుత నమూనాలుగా ఆవిష్కృతమయ్యాయి. సోమవారం నగర శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద రమాదేవి పబ్లిక్‌ స్కూల్‌లో యంగ్‌ సైంటిస్ట్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌ పేరిట ఏర్పాటు చేసిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శన విశేషంగా అలరిస్తోంది. రెండ్రోజుల పాటు కొనసాగనున్న ప్రదర్శనలో సుమారు 600 మంది విద్యార్థులు పాల్గొని అబ్బురపరిచే వైజ్ఞానిక నమూనాలను ప్రదర్శిస్తూ ప్రతిభ చాటుతున్నారు. పాఠశాల పూర్వ విద్యార్థిని, ఈటీవీ భారత్‌ డైరెక్టర్‌ బృహతి ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి బృహతి మాట్లాడుతూ విద్యార్థుల్లోని సృజనను వెలికితీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. పరిశోధనల్లో చురుకుగా వ్యవహరిస్తూ ఉత్తమ శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు.

సోలార్‌ సిటీ గురించి వివరిస్తున్న విద్యార్థిని

ఆకట్టుకున్న నమూనాలు.. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలను బృహతి ఆసక్తిగా తిలకించారు. వాటికి సంబంధించిన విశేషాలను చిన్నారులను అడిగి తెలుసుకున్నారు. భౌతిక, రసాయన, జీవశాస్త్రంతోపాటు కంప్యూటర్‌, హోం సైన్స్‌ విభాగాల్లో రూపొందించిన పరికరాలు, నమూనాలు, వాటి పనితీరును విద్యార్థులు వివరించారు. కంప్యూటర్‌ రంగంలో మెటావర్స్‌ సాంకేతికతపై నేటితరం ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తోందని... లేని వ్యక్తిని ఉన్నట్లుగా సృష్టించే ఈ గేమింగ్‌ ప్రక్రియ ద్వారా ఇంట్లో కూర్చునే ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ను పెంపొందించుకోవచ్చని విద్యార్థులు వివరించారు. అవతార్‌, బాహుబలి వంటి క్రియేషన్లన్నీ ఈ కోవకే చెందుతాయని చెబుతున్నారు. వైఫైని రీప్లేస్‌ చేసే లైఫై యాప్‌ని సృష్టించారు. ఓట్స్‌తో తయారుచేసిన బలవర్థకమైన పిజ్జా, మంచి పోషకాలుండే పన్నీర్‌ ఫ్రాంకీస్‌, తక్కువ ధరలో తయారయ్యే హెర్బల్‌ కాస్మొటిక్‌ వస్తువులను ప్రదర్శించారు. ఇంట్లోని తడి వ్యర్థాలతో సేంద్రియ ఎరువులను తయారుచేసి మొక్కలకు ఉపయోగించడంపై వివరించారు. ఫొటోగ్రఫీలో వస్తున్న ఆధునిక రంగుల హరివిల్లును ఆవిష్కరించారు. మట్టిలో కలిసిపోయేలా.. మళ్లీ వినియోగించి ఉత్సవ విగ్రహాలను తయారుచేసేలా.. రూపొందించిన పాలీమర్‌ ఉపయోగాలను వివరించారు.

నమూనాలతో తరలివస్తూ..

12న తల్లిదండ్రులకు ప్రత్యేకం.. వైజ్ఞానిక ప్రదర్శనను ఈ నెల 12న విద్యార్థుల తల్లిదండ్రులు వీక్షించేలా ఓపెన్‌ డే నిర్వహిస్తున్నట్లు రమాదేవి పాఠశాల ట్రస్టీ రావి చంద్రశేఖర్‌, వైస్‌ ప్రిన్సిపల్‌ ఖమర్‌ సుల్తానా వివరించారు. కార్యక్రమంలో పాఠశాల ఇన్‌ఛార్జులు వైదేహి, వసుంధరా దేవి, అకడమిక్‌ కోఆర్డినేటర్లు సునీల, కె.విజయలక్ష్మి, ప్రతిమ, రోజ్‌లిన్‌ పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 8, 2022, 9:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.