ప్రభుత్వం కక్షపూరితంగా టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌పై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టించిందని మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. రవి ప్రకాష్ అరెస్ట్పై జాతీయ స్థాయిలో ఆందోళన చేపడుతామని ఆయన పేర్కొన్నారు. చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న రవిప్రకాష్‌ను రేవంత్ రెడ్డి ములాఖత్ ద్వారా కలిశారు. కాంగ్రెస్ పార్టీ అతనికి అండగా నిలుస్తుందని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.
ఇదీ చదవండిః పోలీసుల అదుపులో టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్