Rangareddy Young Man Murder Case Update : కుమార్తె వరసయ్యే యువతితో అనైతిక సంబంధం కొనసాగిస్తున్న యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. యువతి తండ్రి.. మరో నలుగురితో కలిసి ఈ దారుణానికి పాల్పడ్డాడు. గత నెల 15వ తేదీన రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలో యువకుడిని హత్య చేసి పరారైన నిందితులు.. నెల తర్వాత ఓ మహిళతో ఫోన్ మాట్లాడి పోలీసులకు చిక్కారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన కరణ్ కుమార్ (18) రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం నిర్దవెల్లిలో ఓ కోళ్ల ఫారం(Poultry farm)లో కూలీ పనులు చేస్తుంటాడు. అదే రాష్ట్రానికి చెందిన రంజిత్ కుమార్ కుటుంబం సహా నిర్దవెల్లికి ఉపాధి కోసం వచ్చి స్థానిక కోళ్ల ఫారంలో పనిచేస్తున్నాడు. కరణ్ కుమార్, రంజిత్ కుమార్ ఒకే ప్రాంతానికి చెందినవారు. ఇద్దరూ వరుసకు సోదరులు అవుతారు. వావి వరసలు మరిచి కరణ్ కుమార్.. రంజిత్ కుమార్ కుమార్తెను ప్రేమించాడు. వారి ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది.
Young Man Murder Case News : విషయం తెలుసుకున్న యువతి తండ్రి రంజిత్.. కరణ్‌ను పలుమార్లు హెచ్చరించాడు. తన కుమార్తె కరణ్‌కి కూడా కుమార్తె అవుతుందని చెప్పాడు. ఇవేవీ కరణ్ పట్టించుకోకుండా.. కొద్దిరోజుల పాటు యువతిని ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లేవాడు. దీంతో యువతి తండ్రి కరణ్‌ను గట్టిగా బెదిరించాడు. తర్వాత కరణ్ పనికోసం సిద్దిపేటకు వెళ్లాడు. అక్కడ పనిలో కుదిరాడు. అక్కడికెళ్లినా అతనిలో ఏ మాత్రం మార్పురాలేదు. ఆమెతో తనకు వివాహమైందంటూ సామాజిక మాధ్యమాల్లో(Social Media) ప్రచారం చేశాడు. యువతి నుదుట కుంకుమ పెట్టిన ఫోటోలు(Photos) పోస్టు చేసేవాడు. కరణ్ పనులపై విసిగిపోయిన రంజిత్.. అతడిని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం తనకు పరిచయస్తులైన.. బిహార్‌కు చెందిన ముంతోశ్ కుమార్, బబ్లూ, మరో ఇద్దరు మైనర్ల సాయం కోరాడు.
పని ఉందని పిలిపించి..: రంజిత్ పథకం ప్రకారం.. ఆగస్టు 15వ తేదీన కరణ్‌కు ఫోన్ చేశాడు. పొలంలో పని ఉంది రమ్మని చెప్పి పిలిపించి.. నిర్దవెల్లి-జూలపల్లి మధ్య రహదారి పక్కకు అతనిని తీసుకెళ్లాడు. దీంతో అక్కడే ఉన్నవారు బురద నీటిలో ముంచి ఊపిరి ఆడకుండా చేసి హతమార్చారు. అనంతరం యువడిని అక్కడే పాతిపెట్టి పరారయ్యారు. తన తమ్ముడు కనిపించడం లేదంటూ.. కరణ్ అన్న దీపక్ గత నెల 29వ తేదీన కేశంపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పాలీసులు.. కేసు నమోదు చేసి కాల్ డేటా(Call Data) ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టారు.
ఫోన్ సిగ్నల్ ఆధారంగా గుర్తించిన పోలీసులు : చివరిసారిగా రంజిత్ కాల్ చేయడం, కరణ్ ఫోన్ సిగ్నల్(Phone Signal) నిర్దవెల్లి మధ్య ఉన్నట్లు గుర్తించారు. ప్రాథమిక ఆధారాల అనంతరం యువకుడిని రంజిత్ హత్య చేసినట్లు రుజువైంది. ఈలోపే హత్యకు పాల్పడిన నిందితులు.. ఇతర ప్రాంతాలకు పరారయ్యారు. వారు తమ ఫోన్లు స్విచాఫ్ చేయడంతో వారి ఆచూకీ కనుక్కోవడం కష్టమైంది. ఈ సమయంలోనే నిందితుల్లో ఒకరు యువతికి కాల్ చేసి స్విచాఫ్ చేశారు. సమాచారం అందుకున్న కేశంపేట పోలీసులు.. ఏపీలోని ప్రకాశం జిల్లా అద్దంకిలో నిందితులు తలదాచుకున్నట్లు గుర్తించారు. అనంతరం అక్కడికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. హత్యలో పాల్గొన్న ముగ్గురు నిందితుల్ని రిమాండుకు.. ఇద్దరు మైనర్లను జువైనల్ హోం(Juvenile Home)కు తరలించారు.
Facebook Love Story: ఫేస్బుక్ ప్రేమకథా చిత్రమ్..! ఒక్కటైన చిత్తూరు యువకుడు శ్రీలంక యువతి