రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రభుత్వ కమ్యూనిటి హెల్త్ సెంటర్ను జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్(Ranga reddy collector) సందర్శించారు. కరోనా ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటుపై డాక్టర్ ప్రదీప్తో చర్చించారు. గర్భిణులకు అక్కడ చికిత్స ఉండడం వల్ల… మరో ప్రాంతంలో కరోనా రోగులకు ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని అధికారులకు తెలిపారు.
అంతకుముందు షాబాద్ మండలం సర్దార్ నగర్ విపణిలోని ధాన్యం గిడ్డంగులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తమకు గిన్ని బస్తాలు కావాలని మొరపెట్టుకున్నారు. తక్షణమే ఐదు వేల బస్తాలు అందిస్తామని పాలనాధికారి చెప్పారు. వ్యవసాయ శాఖలో పంట నమోదు చేసుకున్న రైతులందరికీ బస్తాలు అందిస్తామని వెల్లడించారు.
ఇదీ చూడండి: Devarayamjal lands: దేవరయాంజల్ భూముల్లోని వారిని ఖాళీ చేయించొద్దు: హైకోర్టు