ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం ఇవ్వకుండా... గ్రేటర్ ఎన్నికలకు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పేర్కొన్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 30 వార్డులకు పోలింగ్ జరగనుందని.. ఈ పరిధిలో విధులు నిర్వహించే ఎన్నికల సిబ్బందికి పలు సూచనలు చేసినట్లు సీపీ తెలిపారు.
పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా 8 వేల మంది పోలీసులు విధుల్లో ఉంటారని... భద్రత విషయంలో ఎటువంటి రాజీపడబోమని సీపీ స్పష్టం చేశారు. అన్ని పార్టీల నేతలు ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సీపీ కోరారు.
ఇదీ చూడండి: కేసీఆర్ చేపట్టిన దీక్షకు నేటికి 11 ఏళ్లు పూర్తి