Rachakonda Sports Meet: దాదాపు రెండేళ్ల విరామం తర్వాత స్పోర్ట్స్ మీట్ నిర్వహించడం ఆనందంగా ఉందని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అన్నారు. కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నాలుగో వార్షిక స్పోర్ట్స్ మీట్‌ను సీపీ ప్రారంభించారు. కొవిడ్ తర్వాత నిర్వహిస్తున్న స్పోర్ట్స్ మీట్ సిబ్బందిలో నూతనోత్సాహం నింపుతుందని హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్తా అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు కమిషనర్ మహేశ్ భగవత్‌కు ఆయన అభినందనలు తెలిపారు.
రెండేళ్ల తర్వాత స్పోర్ట్స్ మీట్
CP on sports meet: కరోనా వైరస్ కారణంగా రెండేళ్ల తర్వాత స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నట్లు సీపీ మహేశ్ భగవత్ పేర్కొన్నారు. నాలుగు రోజుల పాటు క్రీడలు సంగ్రామం కొనసాగుతుందని తెలిపారు. మొత్తం 35 రకాల క్రీడల్లో పోటీలు జరుపుతున్నట్లు వెల్లడించారు.
జర్నలిస్టులతో ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్
ఈ నెల 10వ తేదీన మీడియా ప్రతినిధులతో రాచకొండ పోలీసుల ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఉంటుందని సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలతో పోలీసు వ్యవస్థలో ఒక మంచి ఫ్రెండ్లీ వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. క్రీడల చివరి రోజు కార్యక్రమానికి ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రామకృష్ణ రావు హాజరవుతారని సీపీ వెల్లడించారు.
- ఇవీ చూడండి:
- Ayudha puja: ఆయుధ పూజలో పాల్గొన్న సీపీలు.. గాల్లోకి కాల్పులు జరిపిన మహేశ్ భగవత్
- రాచకొండ కమిషనరేట్ హెడ్‌క్వార్టర్స్‌లో క్యాంటీన్ ప్రారంభం
- గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన రాచకొండ సీపీ
- Rachakonda Cp: 'దేహదారుఢ్యాన్ని పెంపొందించుకోవాలి'
- అవార్డులను అందుకున్న పోలీసులను సత్కరించిన రాచకొండ సీపీ