కమ్మ, వెలమ సంఘాల భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వం విలువైన భూమిని కేటాయించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. కమ్మ, వెలమ సంఘాలకు రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్‌లో 5 ఎకరాల చొప్పున భూమిని కేటాయిస్తూ జూన్ 30న ప్రభుత్వం జీవో జారీ చేసింది.
చట్టం, నిబంధనలు, సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా సర్కారు భూమిని కేటాయించిందంటూ కాకతీయ విశ్వవిద్యాలయం విశ్రాంత ప్రొఫెసర్ ఎ. వినాయక్ రెడ్డి ఉన్నత న్యాయస్థానంలో పిల్ దాఖలు చేశారు. దీనిపై బుధవారం విచారణ జరిగే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: HIGH COURT: కోర్టులు, ట్రైబ్యునళ్లలో సెప్టెంబరు 9 వరకు పాక్షిక ప్రత్యక్ష విచారణ