హైదరాబాద్ వనస్థలిపురం వ్యాక్సినేషన్ కేంద్రంలో వైద్యుల నిర్లక్ష్యంతో టీకా కోసం వచ్చిన ప్రజలు... గంటల తరబడి వరుసలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. ఉదయం 8 గంటలకు చేరుకోవాల్సిన వైద్యులు... ఆస్పత్రికి రాకపోవడంతో రోడ్లపైనే నిరీక్షించిన ప్రజలు... వర్షం పడడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
వ్యాక్సినేషన్ కేంద్రానికి తాళం కూడా తీయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తీరా... సమయానికి 30 సంవత్సరాల లోపు వారు... స్లాట్ బుక్ చేసుకున్నప్పటికీ వ్యాక్సిన్ వేయడం లేదని వాపోయారు. ఉదయం నుంచి గంటల తరబడి నిలబడినా... వైద్యులు టీకా వేయమని చెప్పడంతో అసహనంతో తిరిగి వెళ్తున్నారు.
ఇదీ చదవండి: ఇమ్మాన్యుయేల్-వర్ష: పెళ్లిపీటలెక్కిన 'జబర్దస్త్' జోడీ!