ETV Bharat / state

12రోజులుగా జలదిగ్బంధంలోనే... ఉస్మాన్​నగర్​ వాసులు కష్టాలు - pond issue in jalpalli mandal rangareddy

రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్ నగర్ ప్రాంతం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. సుమారు 12 రోజుల నుంచి ఇళ్ల చుట్టు నీరు ఉంది. తమ సమస్యను మున్సిపల్​ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా... నీటిని తోడివేసే ఏర్పాట్లు చేశారు.

12రోజులుగా జలదిగ్బంధంలోనే...
12రోజులుగా జలదిగ్బంధంలోనే...
author img

By

Published : Oct 15, 2020, 9:59 PM IST

రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీ పరిధి ఉస్మాన్​ నగర్​ ప్రజలు వరద నీటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో కురిసిన వర్షానికి బుర్హాన్ పూర్ చెరువు నిండి ఇళ్లను చుట్టుముట్టింది. ఈ ప్రాంతంలో పర్యటించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి... ముంపు ప్రాంత ప్రజల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులకు ఆదేశించారు.

అప్పటి వరదకు గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలు తోడవడం వల్ల ఉస్మాన్​నగర్​ ప్రాంతం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. ఈ విషయమై స్థానికులు తమ గోడును మున్సిపల్​ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. పరిసర గ్రామమైన వెంకటపూర్​ గ్రామస్థులతో మాట్లాడి నీరు తరలించే ఏర్పాటు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.