ETV Bharat / state

ప్రచారాల్లో అభ్యర్థులు.. ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు.. - జల్​పల్లి పురపాలక సంఘంలో ఎన్నికల ప్రచారం

రంగారెడ్డి జిల్లా జల్​పల్లి మున్సిపాలిటీలో ఎన్నికల ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. 28 వార్డులకు గానూ 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాట్లు చేసినట్లు... అందులో 18 అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించినట్లు మున్సిపల్​ కమిషనర్ అహ్మద్ సఫీఉల్లాహ్ తెలిపారు.

officers are busy with arrangements and candidates are in campaign in  jalpally municipality
ప్రచారాల్లో అభ్యర్థులు.. ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు..
author img

By

Published : Jan 19, 2020, 9:29 PM IST

పుర ఎన్నికల ప్రచారంలో రెబల్స్ ప్రచారం జోరు అందుకుంది. అధికార పార్టీలకు దీటుగా స్వతంత్ర అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా జల్​పల్లి మున్సిపాలిటీలోని 16 వార్డు నుంచి తెరాస రెబల్ బుడమాల యాదగిరి డప్పు వాద్యాల మధ్య ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ వార్డులో తెరాస, స్వతంత్ర అభ్యర్థులిద్దరే పోటీ చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థి తరఫున జల్​పల్లి మాజీ సర్పంచ్ కట్టెల రాములు ప్రచారం చేస్తున్నారు. తాను తెరాసలో ఉన్నప్పటికీ టికెట్ ఇవ్వలేదని... ప్రాంత అభివృద్ధి కోసం స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచినట్లు తెలిపారు.

మున్సిపాలిటీ 10 వ వార్డులోని సాలెహీన్ కాలనీ ప్రాంతంలో ఎంఐఎం అభ్యర్థి ఒమర్ బిన్ అజిజ్ బామ్ ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ... ఎంఐఎం పార్టీ గుర్తు గాలిపటానికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. తాను గెలిచిన తరువాత వార్డులో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు.

జల్​పల్లి మున్సిపాలిటీలోని 2 వ వార్డులోని బిస్మిల్లాహ్ కాలనీలో కాంగ్రెస్ అభ్యర్థి యూనుస్ హందీ ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. హస్తం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

జల్​పల్లి మున్సిపాలిటీలో ఎన్నికల ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. 28 వార్డులకు సంబంధించి 84 పోలింగ్ కేంద్రాలలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ జరిగే రోజు దాదాపు 500 మంది సిబ్బంది విధుల్లో ఉంటారని మున్సిపల్ కమిషనర్ అహ్మద్ సఫీఉల్లాహ్ తెలిపారు. మొత్తం 84 పోలింగ్ కేంద్రాల్లో... 18 పోలింగ్ కేంద్రాలు అతి సమస్యాత్మకమైనవిగా గుర్తించినట్లు చెప్పారు. అక్కడ ప్రత్యేక కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు.

ప్రచారాల్లో అభ్యర్థులు.. ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు..

ఇవీచూడండి: 'మంత్రులు మల్లారెడ్డి, ఎర్రబెల్లిపై చర్యలు తీసుకోవాలి'

tg_hyd_62_19_mim_pracharam_ab_ts10003. feed from whatsapp desk. రంగారెడ్డి జిల్లా జల్ పల్లి మున్సిపాలిటీ లోని వార్డ్ 10 సాలెహీన్ కాలనీ ప్రాంతంలో mim అభ్యర్థి ఒమర్ బిన్ అజిజ్ బామ్ ఇంటి ఇంటి ప్రచారం చేపట్టారు, ఇంటి ఇంటికి తీరుగుతు mim పార్టీ గుర్తు గాలిపటానికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు, వారు మాట్లాడుతూ mim పార్టీ తోనే అభివృద్ధి సాధ్యం అని, తనను గెలిపించి mim పార్టీని బలపర్చాలని, తను గెలిచిన తరువాత అన్ని సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు. బైట్. అభ్యర్థి ఒమర్ బిన్ అజిజ్ బామ్.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.