రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఈ రోజు నూతన తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ నెల 4న ఎమ్మార్వో విజయారెడ్డిపై సురేష్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన విషయం విదితమే. 24 రోజుల తర్వాత ప్రత్యేక పూజలు చేసి కార్యాలయాన్ని అధికారులు ప్రారంభించారు. నూతన తహసీల్దార్‌గా ఎమ్మార్వో వెంకట్ రెడ్డి ఛార్జి తీసుకున్నారు.
తహసీల్దార్ కార్యాలయానికి మధ్యవర్తిత్వం వహించే వారు రావద్దని, సిబ్బంది ప్రజలతో మమేకమై పని చెసినప్పుడు ఎలాంటి ఘటనలు జరగవని అధికారులు తెలిపారు. త్వరలోనే ప్రభుత్వం స్థలం కేటాయిస్తే సొంత భవనాలు నిర్మిస్తామని చెప్పారు. నూతనంగా బాధ్యతలను చేపట్టిన తహసీల్దార్ వెంకట్‌రెడ్డి వారం రోజుల్లో పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తామని తెలిపారు.
ఇవీ చూడండి: రాజధాని శివారులో యువ వైద్యురాలి దారుణహత్య