పేద మహిళల సంక్షేమానికి తెరాస ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తెలిపారు. రంగారెడ్ది జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కార్యాలయంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఛైర్ పర్సన్ కప్పరి స్రవంతి, వైస్ ఛైర్మన్ ఆకుల యాదగిరి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
మహిళల సంక్షేమం కోసం ప్రతి ఏటా రూ. 315 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుందని ఎమ్మెల్యే వివరించారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు రాష్ట్రంలో అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రతి పేద మహిళ కొత్త బట్టలు కట్టుకుని పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఈ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు.