హైదరాబాద్లో కురిసిన కుండపోత వానలకు ఇళ్లు నీట మునిగి ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని ఆదిత్యానగర్ కాలనీ, ఉమర్ ఖాన్ గూడలోని వరద బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన రూ. పదివేలను అందజేశారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని, మున్సిపాలిటీ పరిధిలోని సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని కిషన్రెడ్డి హామీ ఇచ్చారు. త్వరలోనే వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం భారీగా తగ్గింది'