రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీలోని పదో వార్డులో.. రూ.74 లక్షలతో పైప్ లైన్, రూ. 10లక్షల 80 వేలతో చేపట్టనున్న డ్రైనేజీ పనులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. పనులను.. త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు.
అనంతరం మంత్రి.. కాలనీల్లో తిరుగుతూ స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్వరలో సమస్యలు పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో.. మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్లా బిన్ అహ్మద్ సాదీ, వైస్ ఛైర్ పర్సన్ ఫర్హాన నాజ్, కౌన్సిలర్ సంశుద్దీన్, కో ఆప్షన్ మెంబర్ కృష్ణారెడ్డి, పలువురు తెరాస నేతలు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఏప్రిల్ నుంచే ప్రైవేటు టీచర్లకు సాయం