లి చాంగ్ వి బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో తెలుగు బాలిక లక్ష్య సంహిత ప్రతిభ చాటుకుంది. తమిళనాడు పూరమల్లేలో జరిగిన అండర్ 13 బాలికల సింగిల్స్‌లో లక్ష్య సంహిత గోల్డ్ మెడల్ సాధించింది. అండర్ 13 బాలికల సింగిల్స్ ఫైనల్‌లో లక్ష్య సంహిత గోల్డ్‌మెడల్ పొందింది. అండర్ 13 ఫైనల్‌లో ఇషానికతో పోరాడి 15-14, 15-12 తేడాతో గోల్డ్‌మెడల్ దక్కించుకుంది. అటు అండర్ 15 విభాగంలో ఫైనల్లో నక్షత్రను 15-12, 15-10 స్కోర్‌తో లక్ష్య సంహిత ఓడించింది.
అండర్ 17 బాలికల సింగిల్స్ ఫైనల్‌లో ఇదే నక్షతను ఓడించి లక్ష్య సంహిత సిల్వర్ మెడల్ గెలుచుకుంది.విజేతలకు మిత్రా స్పోర్ట్స్ క్లబ్ ట్రోఫీ, కిట్ బాగ్స్, రాకెట్, సర్టిఫికేట్స్ అందజేశారు లక్ష్య సంహిత పాల్గొన్న అన్ని విభాగాల్లో మెడల్స్ సాధించిందని ప్రధాన కోచ్ వేణు ముప్పాల తెలిపారు. చిన్న వయసులోనే లక్ష్య సంహిత అద్భుతమైన ఆటతో అందరిని ఆకట్టుకున్నదనది, భవిష్యత్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి టోర్నమెంట్స్‌లో రాణిస్తుందని కోచ్ వేణు ఆశాభావం వ్యక్తం చేశారు.