రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం పరిధిలోని అర్హులకు జల్పల్లిలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అర్హులైన 264 మందికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం అందజేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు కందుకూరు డివిజన్ ఆర్డీవో రవీందర్ రెడ్డి, జల్పల్లి మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్లాహ్ సాది, బాలాపూర్ ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: యాత్రకు వెళ్లి 10 మంది గల్లంతయ్యారని ప్రచారం.. నిజనిర్ధరణలో పోలీసులు