ETV Bharat / state

Rachakonda police: పోలీసులు కనిపించరు.. చోరీకి గురైన వాహనాన్ని పట్టేస్తారు - Safe and Smart City Project

మీ వాహనం చోరీకి గురైతే ఇట్టే పట్టేస్తారు. రోడ్డుపై ఎక్కడ గుంతలున్నాయే చెప్పేస్తారు. మీరు వెళ్లే రూట్​లో రద్దీ ఉంటే అప్​డేట్ ఇస్తారు.. ఇవన్నీ ఏ అధికారులో.. పోలీసులో చేస్తారనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఐటీఎంఎస్​ సాయంతో.. సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా రాచకొండ కమిషనరేట్​ ఈ విధానం అమల్లోకి వచ్చింది.

పోలీసులు కనిపించరు.. చోరీకి గురైన వాహనాన్ని పట్టేస్తారు

author img

By

Published : Jul 29, 2021, 11:42 AM IST

పోలీసులు ఎక్కడా కనిపించరూ. అయినా.. చోరీకి గురైన వాహనాన్ని పట్టేస్తారు. ఫలానా రోడ్డుపై ఎక్కడెక్కడ గుంతలున్నాయో చెప్పేస్తారు. మీరు వెళ్లాలనుకుంటున్న రూట్లో ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువగా ఉంటే ప్రత్యామ్నాయ మార్గాలేంటో ‘ఇంటిగ్రేటెడ్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం(ఐటీఎంఎస్‌)’ తో ఫేస్‌బుక్, ట్విటర్, వాట్సాప్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో చెప్పేస్తారు. ఈ వ్యవస్థను ‘సేఫ్‌ అండ్‌ స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు’లో భాగంగా రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో బుధవారం అందుబాటులోకి తెచ్చారు. రద్దీగా ఉండే నాలుగు ప్రధాన మార్గాలను ఎంపిక చేసి అనుసంధానించారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచే నిరంతరం పర్యవేక్షిస్తూ ఆయా మార్గాల్లో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తారు. ట్రాఫిక్‌ ఉల్లంఘనులకు చలాన్లు విధిస్తారు. నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు. నిర్వహణ లోపాలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి మరమ్మతులు చేయిస్తారు.

ఎక్కడెక్కడ..

నేరెడ్‌మెట్‌ ఎక్స్‌ రోడ్డు నుంచి ఈసీఐఎల్‌ జంక్షన్‌ వరకు

హబ్సిగూడ- ఉప్పల్‌ జంక్షన్‌

సాగర్‌ రింగ్‌ రోడ్డు- గుర్రంగూడ

ఆటో నగర్‌-కొత్తపేట్‌ ఎక్స్‌ రోడ్డు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.