ETV Bharat / state

అక్రమాలను ఉపేక్షించేది లేదు: హమ్మద్ షఫీ ఉల్లా

author img

By

Published : Jan 24, 2021, 9:42 AM IST

అక్రమ కట్టడాలు నిర్మిస్తే ఎంతటి వారినైనా ఉపక్షించేది లేదని... కఠిన చర్యలు తీసుకుంటామని తుర్కయంజాల్ మున్సిపల్ కమిషనర్ హమ్మద్ షఫీ ఉల్లా తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనాన్ని సీజ్ చేశారు. అక్రమ కట్టడాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.

illegal-constructions-demolition-at-turkayamjal-municipality-in-rangareddy-district
'ఎంతటి వారినైనా ఉపక్షించేది లేదు... కఠిన చర్యలు తప్పవు'

అక్రమ కట్టడాలు నిర్మిస్తే సహించేది లేదని రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపల్ కమిషనర్ హమ్మద్ షఫీ ఉల్లా హెచ్చరించారు. తుర్కయంజాల్ సాగర్ రహదారి ప్రక్కన ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనాన్ని సీజ్ చేశారు. పురపాలక సంఘం పరిధిలోని మునగనూరు 15 వార్డులో అక్రమ నిర్మాణాలను సిబ్బంది కూల్చివేశారు. అలాగే ఇంజాపూర్​లోని తుల్జా భవాని కాలనీలో 200 గజాలు, సాయి దయ కాలనీలో ఆరు వందలు గజాలు కబ్జాలకు గురైన పార్కు స్థలాలను స్వాధీనపరచుకుని బోర్డులను ఏర్పాటు చేశారు.

నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ కట్టడాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. ఇప్పటికే అనేక అక్రమ కట్టడాలను సీజ్ చేయడంతోపాటు జరిమానాలను విధించినట్లు తెలిపారు. అక్రమాలకు పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించబోమని... కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ స్పెషల్ డ్రైవ్​లో మున్సిపాలిటీ టీపీవో ఉమతోపాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 'చదువు' అస్తవ్యస్తం- నేడు అంతర్జాతీయ విద్యా దినోత్సవం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.