నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే శంషాబాద్ ప్రధాన రహదారిపైకి ఒక్కసారిగా భారీ కొండచిలువ రావడం కలకలం రేపింది. కొండచిలువను చూడగానే వాహనదారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వర్షం కారణంగా బుధవారం రాత్రి వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
క్రమంగా వర్షం తగ్గుముఖం పట్టిన తర్వాత భారీ కొండచిలువ రోడ్డుపైకి వచ్చింది. ఇది గమనించిన వాహనదారులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడం వల్ల కొండచిలువ క్రమంగా కదులుతూ అక్కడ నుంచి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చూడండి : దిండి ప్రాజెక్టులో చిక్కుకుపోయిన దంపతులు సేఫ్