ETV Bharat / state

ఆస్పత్రి సిబ్బంది స్థానికుల మధ్య గందరగోళం - మున్సూరాబాద్​ తాజా వార్తలు

ఎల్బీనగర్ నియోజకవర్గం మన్సూరాబాద్​లోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో వాక్సినేషన్​ కోసం వచ్చిన పలువురు ఇబ్బందులు పడ్డారు. టోకెన్లు ఉంటేనే టీకా వేస్తామని, ఆన్​లైన్​లో రిజిస్టర్​ చేసుకున్నా కూడా వెనక్కి పంపించారని సిబ్బందిపై ఆవేదన వ్యక్తం చేశారు.

Hospital staff quarrel between local people, mansoorabad rangareddy news
ఆస్పత్రి సిబ్బంది స్థానికుల మధ్య గందరగోళం
author img

By

Published : Apr 27, 2021, 3:21 PM IST

ఆస్పత్రి సిబ్బంది స్థానికుల మధ్య గందరగోళం

ఎల్బీనగర్ నియోజకవర్గం మున్సూరాబాద్​ పట్టణ ఆరోగ్య కేంద్రంలో గందరగోళం తలెత్తింది. ఆస్పత్రి సిబ్బంది.. స్థానికుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. సిబ్బంది అవగాహన లోపంతో.. వ్యాక్సినేషన్​ కోసం వచ్చిన వారు అవస్థలు పడ్డారు.

వ్యాక్సిన్​ కోసం వచ్చిన వారంతా.. క్యూలో నిల్చుని టోకెన్లు తీసుకోవాలని సిబ్బంది సూచించారు. టోకెన్లు ఉంటేనే టీకా వేస్తామని చెప్పారు. సిబ్బంది సూచనలపై వృద్ధులు మండిపడ్డారు. వ్యాక్సిన్​ కోసం ఆన్​లైన్​లో ముందుగానే రిజిస్టర్​ చేయించుకున్నామని చెప్పారు. అయినా వినకుండా తమను వెనక్కి పంపిస్తున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.

పట్టణ ఆరోగ్య కేంద్ర ప్రాంగణంలో.. ఈ గందరగోళం మధ్య మాస్కులు వినియోగం, భౌతికదూరం మరిచి.. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు.

ఇదీ చూడండి : మూడు రోజులు ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.