ETV Bharat / state

రంగారెడ్డి జిల్లాలో ఉప్పొంగుతున్న వాగులు, వంకలు

గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రంగారెడ్డి జిల్లాలోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. షాబాద్​ మండలంలోని నాగర్​గూడ ఈసీ వాగు. శంకర్​పల్లి పట్టణానికి సమీపంలో ఉన్న మూసీ వాగు, తీగల వాగులు ఉప్పొంగాయి. శంకర్​పల్లి పట్టణ వాసులు వరదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

author img

By

Published : Sep 19, 2020, 6:03 PM IST

heavy rains in rangareddy district and floating brooks
రంగారెడ్డి జిల్లాలో ఉప్పొంగుతున్న వాగులు, వంకలు

రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లాయి. షాబాద్​ మండలంలోని నాగర్​గూడ ఈసీ వాగు ఉద్దృతంగా ప్రవహిస్తోంది. గత ఐదేళ్లలో ఈ ఏడాది ఈసీ వాగు నిండుకుండలా ప్రవహిస్తోంది. నీటితో కళకళలాడతున్న నాగర్​గూడ ఈసీ వాగును చూసేందుకు సందర్శకులు వస్తున్నారు.

శంకర్​పల్లి పట్టణానికి సమీపంలో మూసీ వాగు, తీగల వాగు పొంగిపొర్లుతున్నాయి. దీంతో వరద నీరు శంకర్​పల్లి పట్టణంలోకి చేరింది. ఇళ్లలోకి నీరు చేరడం వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్​ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొందరి నివాసాల్లో నిత్యావసర వస్తువులు తడిసి ముద్దయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్​ అధికారులు సూచించారు.

ఇవీ చూడండి: హైదరాబాద్​లో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.