రంగారెడ్డి జిల్లా జల్పల్లిలో పారిశుద్ధ్య కార్మికులకు కొవిడ్-19 నేపథ్యంలో ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ అహ్మద్ సఫీఉల్లాహ్ శిబిరాన్ని పర్యవేక్షించారు. రాష్ట్ర పుర పాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు మున్సిపల్ కార్మికులకు, విద్యుత్, నీటి సరఫరా సిబ్బందికి నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన్నట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం వారికి మందులు పంపిణీ చేశారు.