ETV Bharat / state

RAKHI POURNAMI: సహోదరత్వానికి ప్రతీక 'రక్షా బంధన్'​.. ప్రజలకు ప్రముఖుల శుభాకాంక్షలు - rakhi pournami wishes

రేపు రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రజలకు పలువురు ప్రముఖులు​ శుభాకాంక్షలు తెలిపారు. సహోదరత్వానికి, భారతీయ సంప్రదాయ ఔన్నత్యానికి రక్షాబంధన్​ ప్రతీకగా నిలుస్తుందని గవర్నర్​ తమిళిసై, సీఎం కేసీఆర్​ పేర్కొన్నారు. ఆనందోత్సాహాలతో ఈ పండుగ జరుపుకోవాలని మంత్రి సత్యవతి, టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ఆకాంక్షించారు.

raksha bandhan
రాఖీ పౌర్ణమి
author img

By

Published : Aug 21, 2021, 8:07 PM IST

రక్షా బంధన్​ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్​ తమిళిసై సౌందర్​ రాజన్​, సీఎం కేసీఆర్​, మంత్రి సత్యవతి, టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ శుభాకాంక్షలు తెలియజేశారు. అన్నాచెల్లెల్లు, అక్కాతమ్ముళ్లు ఆనందోత్సాహాలతో ఈ పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.

మరింత బలోపేతం కావాలి: గవర్నర్​

గొప్ప భారత సంప్రదాయానికి రాఖీపౌర్ణమి నిదర్శనంగా నిలుస్తుందని గవర్నర్​ అన్నారు. సోదరుని చేతికి కట్టే రాఖీ.. రక్షణకు ప్రతీక అని పేర్కొన్న తమిళిసై... సోదర, సోదరీమణుల బంధం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. బేటీ బచావో... బేటీ పడావో స్ఫూర్తితో రక్షాబంధన్​ను జరుపుకోవాలని కోరారు. అందరూ కొవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు.

గొప్ప సందర్భం: సీఎం కేసీఆర్​

సహోదరత్వానికి ప్రతీకగా రక్షాబంధన్‌ నిలుస్తుందని సీఎం కేసీఆర్​ అన్నారు. జీవితాంతం తమకు అండగా ఉండాలని ఆడబిడ్డలు.. అన్నాదమ్ముళ్లకు అనురాగంతో చేతికి రక్షా బంధనాన్ని కట్టడం గొప్ప సందర్భమని ముఖ్యమంత్రి అన్నారు. రక్షా బంధన్ సంప్రదాయం భారతీయ జీవన ఔన్నత్యానికి నిదర్శనమని.. ప్రజల్లో సోదరత్వాన్ని మరింతగా పెంచుతుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

ఆనందోత్సాహాలతో: మంత్రి సత్యవతి

ఆప్యాయతలు, అనురాగాలతో అన్నాచెల్లెల్లు, అక్కాతమ్ముళ్లు ఆనందోత్సాహాలతో రాఖీ పండుగ జరుపుకోవాలని మంత్రి సత్యవతి రాఠోడ్​ ఆకాంక్షించారు. మహిళా- శిశు సంక్షేమానికి సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని మంత్రి అన్నారు. మహిళల రక్షణ కోసం షీ టీమ్స్, సఖీ సెంటర్లు ఏర్పాటు చేశారని చెప్పారు. స్త్రీల భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదని చెప్పారు. అంగన్ వాడీల ద్వారా మహిళలు, శిశువుల ఆరోగ్యం, అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు. సీఎం కేసీఆర్‌ ఆశయాలను ప్రతిబింబించే విధంగా మహిళా శిశు సంక్షేమ శాఖ నిత్యం మహిళలు, శిశువుల సంక్షేమానికి, రక్షణకు కృషి చేస్తోందని పేర్కొన్నారు.

ఎంతో పవిత్రమైంది: రేవంత్ రెడ్డి

సోదర సోదరీమణుల ప్రేమ, ఆప్యాయతలకు ప్రతీక అయిన రక్షా బంధన్ పర్వ దినాన్ని తెలంగాణ ప్రజలు ఘనంగా జరుపుకోవాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అన్నదమ్ముల రక్షణ కోసం అక్కా చెల్లెల్లు కట్టే రక్షా బంధన్ మన సంప్రదాయంలో ఎంతో పవిత్రమైనదని ఆయన అన్నారు.

అండగా నిలుస్తానని హామీ: బండి సంజయ్​

అన్నదమ్ములు విజయం దిశగా అడుగులేస్తూ అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలని కాంక్షిస్తూ అక్కాచెల్లెల్లు అనురాగంతో రాఖీ కట్టే పర్వదినం రక్షాబంధన్​ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ వెల్లడించారు. ఏ కష్టమైనా అండగా నిలుస్తానని సోదరులు హామీ ఇచ్చే పండుగే ‘రక్షా బంధన్'​గా పేర్కొన్నారు. ఈ పండుగను రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని బండి సంజయ్ ఆకాంక్షించారు.

ఇదీ చదవండి: Revanth Reddy: 'వైఎస్ఆర్, చంద్రబాబు, కేసీఆర్ ఇక్కడి నుంచే వచ్చారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.