ETV Bharat / state

Govt Help: మ్యాన్​హోల్ మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం - కార్మిక కుటుంబాలకు సర్కార్ సాయం

హైదరాబాద్‌ ఎల్​బీనగర్‌లోని సాహెబ్​నగర్‌లో మురుగునీటిని శుభ్రపరిచేందుకు మ్యాన్​హోల్​లోకి దిగి గల్లంతయిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది. సర్కార్ తరఫున ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జీహెచ్ఎంసీ విజయలక్ష్మి.. బాధిత కుటుంబాలకు చెక్ అందించారు.

Government
ప్రభుత్వం ఆర్థిక సాయం
author img

By

Published : Aug 7, 2021, 8:47 PM IST

రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని సాహెబ్​నగర్​లోని పద్మావతి కాలనీలో మూడు రోజుల క్రితం రాత్రి డ్రైనేజీ పనుల నిమిత్తం అందులోకి దిగి మరణించిన కార్మికులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది. సర్కార్ తరఫున ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జీహెచ్ఎంసీ విజయలక్ష్మి.. బాధిత కుటుంబాలకు రూ.15 లక్షల చెక్ అందించారు.

రంగారెడ్డి జిల్లా కలెక్టర్​తో మాట్లాడి శివ, అంతయ్య కుటుంబాలకు రెండు డబుల్ బెడ్ రూమ్​లు ఇప్పిస్తామని వారు హామీ ఇచ్చారు. జీహెచ్ఎంసీ మేయర్ ఫండ్​ నుంచి ఒక్కొక్కరికి రూ.రెండు లక్షల చొప్పున ఇస్తామని మేయర్ విజయలక్ష్మి తెలిపారు. బాధిత కుటుంబానికి ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం చేస్తామన్నారు. ఈ ఘటనకు సంబంధించిన అధికారులను సస్పెండ్ చేశామని... సదురు కాంట్రాక్టర్​పై కేసు కూడా నమోదు చేసినట్లు పేర్కొన్నారు. తాను చదువుకున్నానని... తనకు ఎవరూ లేరని ప్రభుత్వం స్పందించి ఉద్యోగం ఇప్పించాలని శివ భార్య కోరారు. అంతయ్య భార్యకు చెక్ అందజేసినప్పటికీ తన భర్త మృతదేహం ఇప్పించాలని ప్రాధేపడ్డారు. తన కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని కోరారు.

ఇంకా దొరకని మృతదేహం...

మురుగునీటిని శుభ్రపరిచేందుకు మ్యాన్​హోల్ లోకి దిగి గల్లంతయిన కార్మికుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. చంపాపేట్ చింతలబస్తీకి చెందిన కార్మికులు శివ, అంతయ్య మురుగునీటిని శుభ్రపరిచేందుకు మంగళవారం రాత్రి.... మ్యాన్ హోల్​లోకి దిగారు. ఒకరి తర్వాత ఒకరు దిగి ఊపిరి ఆడక గల్లంతయ్యారు. శివ మృతదేహం వెలికి తీయగా.. అంతయ్య ఆచూకీ ఇంకా లభించలేదు. అంతయ్య డ్రైనేజీ లైన్​లో మరింత కిందకు కొట్టుకుపోయి ఉంటాడని అధికారులు భావిస్తున్నారు.

ఇవీ చూడండి: GHMC: మ్యాన్‌హోల్‌లోకి దిగి ఇద్దరి గల్లంతు.. ఒకరి మృతదేహం లభ్యం
గల్లంతై 30 గంటలపైనే అయ్యింది.. అయినా దొరకని ఆచూకీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.