ETV Bharat / state

కూలిన కొహెడ పండ్ల మార్కెట్.. రోడ్ల మీద పండ్ల అమ్మకాలు

author img

By

Published : May 24, 2020, 9:14 AM IST

Updated : May 24, 2020, 10:07 AM IST

గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్​ను ఏప్రిల్​ 27న తుర్కయంజాల్​ మున్సిపాలిటీ పరిధిలోని కొహెడకు తరలించిన విషయం తెలిసిందే. అయితే.. మే 4న గాలివాన బీభత్సం కారణంగా కొహెడ మార్కెట్​ పూర్తిగా ధ్వంసం అయింది. ఈ పరిస్థితుల్లో తిరిగి మార్కెట్​ను గడ్డి అన్నారం తరలించారు. కొనుగోలుదారులు లాక్​డౌన్​ నిబంధనలు పాటించకపోవడం వల్ల తిరిగి గడ్డి అన్నారం మార్కెట్​ను కూడా మే 12న మూసేశారు.

Gaddi Annaram Market Closed.. vendors Sells Fruits On Beside The Roads
కూలిన కొహెడ పండ్ల మార్కెట్.. రోడ్ల మీద పండ్ల అమ్మకాలు

గడ్డి అన్నారం మార్కెట్​ను తుర్కయంజాల్​ నుంచి కొహెడకు తరలించగా.. గాలివాన వల్ల కొహెడ తాత్కాలిక మార్కెట్​ పూర్తిగా ధ్వంసం అయింది. చేసేదేంలేక.. తిరిగి గడ్డి అన్నారం మార్కెట్​ను మళ్లీ ప్రారంభించారు. కొనుగోలుదారులు భౌతిక దూరం పాటించకుండా, మాస్కులు లేకుండా మార్కెట్​కు వస్తుండడం వల్ల కరోనా వ్యాప్తి చెందుతుందేమో అన్న అనుమానంతో గడ్డి అన్నారం మార్కెట్​ను అధికారులు మూసేశారు.

వ్యాపారులు, రైతులు చేసేదేం లేక.. అక్కడే ఉన్న గిడ్డంగులను అద్దెకు తీసుకొని అందులో తాము తెచ్చిన పండ్లు, కాయలను స్టోరేజ్​ చేసి రోడ్ల మీదే అమ్మకాలు మొదలు పెట్టారు. మామిడి సీజన్​ మరో వారం, పదిరోజులు మాత్రమే ఉండడం వల్ల ప్యాకింగ్​, స్టోరేజీ సదుపాయాలు లేక.. మామిడి వ్యాపారులు రోడ్డు మీదే అమ్మకాలు చేపట్టారు. మార్కెటింగ్​ శాఖ నిర్లక్ష్యం వల్ల ఎన్నడూ లేనంతగా ఈసారి నష్టాలు చవిచూడాల్సి వచ్చిందని మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఆరు గాయాలుంటే ఒకటే అంటారేం..?:హైకోర్టు

Last Updated : May 24, 2020, 10:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.