ETV Bharat / state

'దుబ్బాక గెలుపు ప్రస్థానం అధికారంలోకి వచ్చే వరకు సాగాలి' - హైదర్‌నగర్‌ డివిజన్‌

గ్రేటర్‌ ఎన్నికల్లో భాగంగా భాజపా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. శేరిలింగంపల్లి నియోజక వర్గం పరిధిలోని హైదర్‌ నగర్‌ డివిజన్‌ అభ్యర్థి వెలగ శ్రీనివాస్‌కు మద్దతుగా మాజీ మంత్రి సుజనా చౌదరి.. కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో భాజపా అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు.

ex mininster sujana chowdary meeting with bjp activists
'దుబ్బాక గెలుపు ప్రస్థానం అధికారంలోకి వచ్చేవరకు సాగాలి'
author img

By

Published : Nov 28, 2020, 12:15 PM IST

దేశంలో ఇప్పుడున్న ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలుగా మారిపోయాయని, వాటితో ఏమాత్రం ఉపయోగం లేదని భాజపా మాజీ మంత్రి సుజనా చౌదరి అన్నారు. కేవలం భాజపా మాత్రమే జాతి ప్రయోజనాలు కాపాడుతుందని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల దృష్ట్యా శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని హైదర్ నగర్ డివిజన్ అభ్యర్థి వెలగ శ్రీనివాస్‌కు మద్దతుగా 123వ డివిజన్‌ భాజపా నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో సుజనా చౌదరి పాల్గొన్నారు.

రానున్న ఎన్నికల్లో భాజపా అభ్యర్థులను గెలిపించుకోవాలని సుజనా సూచించారు. దుబ్బాక ఎన్నికలతో మొదలైన గెలుపు ప్రస్థానం తెలంగాణలో అధికారంలోకి వచ్చే వరకు సాగాలని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 'అసదుద్దీన్​ను జిన్నాగా చిత్రీకరిస్తే సమస్యలు పరిష్కారమవుతాయా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.