రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీలోని శ్రీరాం కాలనీ ప్రాంతంలో పరిశ్రమల నుంచి భారీగా వ్యర్థాలు ప్రవహిస్తున్నాయనే ఫిర్యాదుతో.. జల్పల్లి మున్సిపల్ కమిషనర్ డా.జీపీ కుమార్ తన సిబ్బందితో కలిసి పరిశ్రమలపై దాడి చేశారు. చట్ట విరుద్ధంగా నడుస్తున్న 7 ప్లాస్టిక్ పరిశ్రమలు, ఒక ఆహార పరిశ్రమను మున్సిపల్ కమిషనర్ సీజ్ చేశారు.
పరిశ్రమల్లో మలిన ప్లాస్టిక్‌ను శుద్ధి చేసి.. వాటి నుంచి వచ్చిన మురికి నీటిని, చిన్న చిన్న ప్లాస్టిక్ ముక్కలను రహదారిపై వదులుతున్నారు. ఎలాంటి ప్రమాణాలు పాటించకుండా.. సరైన అనుమతులు లేకుండా కాలుష్యాన్ని వెదజల్లుతున్నారు. దీనిపై స్థానికుల ఫిర్యాదు మేరకు ఇవాళ ఫ్యాక్టరీలను సీజ్ చేశారు.