ETV Bharat / state

Minister Sabitha: జల్​పల్లి మున్సిపాలిటీలో మంత్రి సబిత పర్యటన - జల్​పల్లి మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి సబిత

రంగారెడ్డి జిల్లా జల్​పల్లి మున్సిపాలిటీలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha indra reddy) పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

sabitha
education minister
author img

By

Published : Jun 24, 2021, 3:40 PM IST

రంగారెడ్డి జిల్లా జల్​పల్లి మున్సిపాలిటీలోని 17, 18, 19, 20 వార్డుల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. 17,18,19 వార్డుల్లో సుమారు రూ.90 లక్షలతో చేపట్టనున్న సీసీరోడ్​, డ్రైనేజీ, ఓపెన్​ నాలాపై స్లాబు పనులకు శంకుస్థాపన చేశారు.

20వ వార్డులో రూ.64 లక్షల వ్యయంతో నిర్మించిన మిషన్​ భగీరథ తాగునీటి ట్యాంకును ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రితో పాటు జల్​పల్లి మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్లాహ్ బిన్ అహ్మద్ సాది, కౌన్సిలర్లు లక్ష్మీ నారాయణ, పల్లపు శంకర్, బాషమ్మ, శంశుద్దిన్, తెరాస పార్టీ అధ్యక్షుడు ఇక్బాల్ బిన్ ఖలీఫా, ఉపాధ్యక్షుడు యూసుఫ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

Minister Sabitha
జల్​పల్లి మున్సిపాలిటీలో మంత్రి సబిత పర్యటన

ఉపాధిని నమ్ముకుని హైదరాబాద్​కు వివిధ రాష్ట్రాల నుంచి చాలా మంది వస్తున్నారు. వారందరికీ సరైన మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని సీఎం కేసీఆర్​ ఆదేశం. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. జల్​పల్లి మున్సిపాలిటీలోని శ్రీరాం కాలనీలో సుమారు రూ. కోటి 50లక్షలతో రోడ్లు, డ్రైనేజీలు సహా పలు అభివృద్ధి పనులు చేపడుతున్నాం. -సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి.

ఇదీ చూడండి: TALASANI: పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం: తలసాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.