ETV Bharat / state

Drainage Problem: భాగ్యనగర్​ కాలనీవాసుల బాధలు తీరేదెన్నడు? - భాగ్యనగర్​ కాలనీ వాసుల వ్యథ

భాగ్యనగరంలో భారీ వర్షాలు నగర ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం వారి పాలిట మరింత శాపంగా మారింది. పొంగిపొర్లుతున్న డ్రైనేజీతో ఇంటి నుంచి బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. పద్నాలుగు నెలలుగా మొర పెట్టుకుంటున్న వారి సమస్యను ఆలకించే నాథుడే కరవయ్యాడు. ఇక అధికారుల తీరుతో విసిగిపోయిన ప్రజలు సొంతంగా జేసీబీ ఏర్పాటు చేసుకున్నారు. కేవలం ఇంటి నుంచి బయటకు రావడం కోసం జేసీబీని వినియోగించడం ఆశ్చర్యానికి గురి చేసినా ఇదీ మాత్రం నిజం. ఇలాంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న లింగోజిగూడ డివిజన్​ వాసుల బాధలు తీరేదెన్నడు?

Drainage water problem in bhagyanagar colony phase two in lingoji guda
హైదరాబాద్ లింగోజిగూడ డివిజన్​లోని భాగ్యనగర్ ఫేస్ టు కాలనీ వాసులు.
author img

By

Published : Jul 18, 2021, 9:12 PM IST

హైదరాబాద్ లింగోజిగూడ డివిజన్​లోని భాగ్యనగర్ ఫేస్ టు కాలనీ వాసులు.

నగరంలో వర్షం పడితే చాలు ప్రజలు భయం గుప్పిట్లో జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు నగర ప్రజలు వణికిపోతున్నారు. హైదరాబాద్ లింగోజిగూడ డివిజన్​లో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. పొంగి పోర్లుతున్న డ్రైనేజీ వాటర్​ ఇళ్ల మధ్య పేరుకుపోవడంతో ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు భాగ్యనగర్ ఫేస్ టు కాలనీ వాసులు.

గత 14 నెలలుగా అదే సమస్య..

గత 14 నెలలుగా డ్రైనేజీతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కార్పొరేటర్​ను కలిసిన సమస్యకు పరిష్కారం కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీలోని లోతట్టు ప్రాంతంలో డ్రైనేజీ వాటర్ పొంగిపొర్లి మోకాళ్ల లోతు వరకు రోడ్లపైకి నీరు వచ్చి చేరుతోంది. కనీసం నిత్యాసరాలకు బయటకు రాలేని పరిస్థితి. ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు ఇంట్లో నుంచి అడుగు బయటకు పెట్టలేని దుస్థితి భాగ్యనగర్​ ఫేస్​ టూ కాలనీ వాసులది.

జేసీబీ అద్దెకు తీసుకుని మరీ...

బయటకొచ్చేందుకు మరో మార్గం లేక నిత్యావసర సరుకుల కోసం బయటకు వెళ్లేందుకు జేసీబీని అద్దెకు తీసుకున్నారు ఆ కాలనీ వాసులు. గతంలో ట్రాక్​ లైన్​ నిర్మాణానికి 23 కోట్ల రూపాయలు మంజూరైనా.. పక్క కాలనీ వాసులు ఒప్పుకోవడం లేదని జీహెచ్​ఎంసీ అధికారులు నిర్మాణ పనులు నిలిపి వేశారని ఆరోపించారు. ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించి ఈ దుర్భర పరిస్థితి నుంచి కాపాడాలని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యవసర వస్తువులను కొనేందుకు కాలనీవాసులంతా కలిసి జేసీబీ అద్దెకు తీసుకోవాల్సిన పరిస్థితి అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడమే ప్రధాన కారణం..

సాధారణంగా వర్షం పడితే వచ్చే వరద నీరు ఒకటి రెండు రోజుల్లో వెళ్లిపోయేది. కానీ భాగ్యనగర్ ఫేస్ టు కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో రోడ్డుపై నిలిచిపోతోంది. ఇళ్ల చుట్టూ మొత్తం వరద నీటితో నిండిపోవడంతో మోటర్లు పెట్టి మురుగునీటిని ఎత్తిపోయాల్సిన దుస్థితి ఏర్పడిందని కాలనీ వాసులు వాపోతున్నారు.

కాలనీ వాసుల ధర్నా...

డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలంటూ లింగోజిగూడ డివిజన్‌ భాగ్యనగర్ ఫేస్‌ కాలనీ టూ వాసులు అందోళన చేపట్టారు. గత 14 నెలలుగా డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కార్పొరేటర్‌ను కలిసినా లాభం లేదని స్థానికులు అవేదన వ్యక్తం చేశారు. లోతట్టు ప్రాంతం కావడంతో వర్షాకాలంతో డ్రైనేజీ పొంగి ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొందని స్థానికులు తెలిపారు.

ఇదీ చూడండి: HYD RAINS: హైదరాబాద్​లో భారీ వర్షం... స్తంభించిన జనజీవనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.