ETV Bharat / state

కృష్ణా పరివాహక ప్రాంతాల్లో.. బంగారం, వజ్రాల గనులు: జీఎస్​ఐ

కృష్ణానది పరివాహక ప్రాంతంలో బంగారు, వజ్రాల గనులు ఉన్నట్టు జీఎస్​ఐ పరిశోధనలో వెల్లడైంది. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలంలోని అవురుపల్లిలో ఓ రైతుకు పొలం దున్నుతున్న సమయంలో ఓ రాయి దొరికింది. దానిని ల్యాబులో పరిశీలించగా సహజ వజ్రంగా తేలింది. విషయం తెలుసుకున్న జీఎస్​ఐ అధికారులు కృష్ణా పరివాహక ప్రాంతంలో పరిశోధన చేస్తున్నారు.

daimond mines in krishna river belt said by geological survey of india
వజ్రాల గనుల కోసం పరిశోధన చేస్తున్న జీఎస్​ఐ అధికారులు
author img

By

Published : Sep 24, 2020, 3:00 PM IST

కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న రంగారెడ్డి జిల్లాలో పలు చోట్ల వజ్రాలు, బంగారం గనులున్నాయని జీఎస్​ఐ తెలిపింది. జిల్లాలోని మాడుగుల మండలం అవురుపల్లిలో ఓ రైతు భూమి దున్నేటప్పుడు మెరుస్తున్న రాయి దొరికింది. దాన్ని హైదరాబాద్​లోని ఓ ల్యాబ్​లో పరిశీలించగా అది వజ్రమని తేలింది. ఏడేళ్ల క్రితం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్​ఐ) ఓయూలోని భూభౌతిక విభాగం సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఈ గ్రామ పరిసరాల్లో బంగారు, వజ్రాల నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు.

ఈ గ్రామం కృష్ణా నది ఎగువన నల్గొండ, రంగారెడ్డి జిల్లాల సరిహద్దుల్లోనే ఉండటం వల్ల 2018 వరకు ఇక్కడ ఓయు భూ భౌతిక శాస్త్ర విభాగం చేసిన పరిశోధనలు, యూజీసీకి సమర్పించిన నివేదికకు ఇప్పుడు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. నివేదికలో నల్గొండ జిల్లాలోని కృష్ణ ,మూసీ నది పరివాహక ప్రాంతాల్లోనే పెద్దవాగు, డిండి, హాలియా పలుచోట్ల భూగర్భంలో వజ్రాల బంగారు గనులు ఉన్నట్టు ఓయూ భూభౌతిక విభాగానికి చెందిన శాస్త్రవేత్తలు సర్వేలో గుర్తించిన పరిశోధన నివేదికను యూజీసీ సమర్పించారు. అంతకు పదేళ్ళ ముందే జీఎస్ఐ శాస్త్రవేత్తలు 2008లో భూగర్భ గనులపై జియోలాజికల్ సర్వే ఆఫ్​ ఇండియా వారు రీజనల్ సర్వే చేసి నివేదిక సమర్పించారు.

ఐదేళ్ళపాటు క్షేత్ర స్థాయిలో పరిశోధన...
ఓయూ భౌతికశాస్త్ర విభాగం అప్పటి అధిపతి ఆచార్య రాందాస్ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు 2013లో నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిశోధనలు ప్రారంభించారు. ప్రాథమిక దశలో రీజినల్ సర్వే నిర్వహించారు. రెండో దశలో సమగ్ర సర్వే నిర్వహించి కృష్ణా నది పరివాహక ప్రాంతమైన నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ సమీపంలోని దేవరకొండలో యురేనియం, పెద్దవూర మండలంలో ఐరన్, మిర్యాలగూడెం సమీపంలోని అనుముల మండలం రామడుగు, గుర్రంపోడు మండలం కనగల్ వద్ద వజ్రాలు, బంగారం గనులు ఉన్నట్టు గుర్తించారు.

ఆయా ప్రాంతాల్లోని భూగర్భంలోని మట్టి రాళ్లు నీటి నమూనాలను సేకరించి ప్రయోగశాలలో పరీక్షించారు. భూగర్భంలోని రిమోట్ సెన్సింగ్ సాటిలైట్ చిత్రాలను తీయించి విశ్లేషించారు. ఈ పరిశోధనల నివేదికను 2015లో యూజీసీకి సమర్పించారు. దీంతో సంతృప్తి చెందిన యూజీసి, ఓయూ జియో ఫిజిక్స్ విభాగం ఆధ్వర్యంలో వజ్రాల గనులపై విస్తృత పరిశోధనను నిర్వహించే ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చింది.

ఓయూ రీసెర్చ్ స్కాలర్ జీ శ్రీరాములు ఆధ్వర్యంలో ఆచార్య రాందాస్ పర్యవేక్షణలో 2018 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాలో పరిశోధనలను కొనసాగించారు. వారు సూచించిన ప్రాంతంలోనే తాజాగా వజ్రాల రాయి బయటపడింది. దీంతో గతంలో జీఎస్ఐ, ఉస్మానియా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు వజ్రాలు బంగారు గనులు నట్టు గుర్తించిన నల్లగొండ మహబూబ్ నగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలపై ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలోనే భూగర్భ ఖనిజాల అన్వేషణపై దృష్టి సారిస్తే మరిన్ని ఫలితాలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు వెల్లడిస్తున్నారు.

అన్వేషిస్తే మరిన్ని ఫలితాలు...
కృష్ణా ,మూసీ నది పరివాహక ప్రాంతంలోని భూగర్భంలో అపారమైన వజ్రాలు, బంగారు గనులు ఉన్నట్లు తమ క్షేత్ర స్థాయి పరిశోధనల్లో వెల్లడైందని.. దాన్ని సమగ్రంగా క్రోడీకరించి యూజీసీకి 2018 లోనే సమర్పించారు. ఇప్పుడు ఆ ప్రాంతంలోనే తాజాగా వజ్రాల రాయి బయటపడింది. ఈ ప్రాంతంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రయోగాలు చేస్తే మరియు అద్భుతమైన ఫలితాలు వస్తాయని ఓయూ ఫిజిక్స్​ విభాగ విశ్రాంత అధిపతి ఆచార్య రాందాస్​ అన్నారు.

ఇదీ చూడండి: కొత్త రెవెన్యూ చట్టం ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు రక్షణ: సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.