ETV Bharat / state

కరోనా సమయంలో పెట్రో ధరల పెంపు అమానవీయ చర్య: ఉత్తమ్​ - కాంగ్రెస్​ ధర్నా తాజా వార్తలు

కరోనా కాలంలో కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలను పెంచడం అమానవీయ చర్య అని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్​కుమార్​రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. పెట్రో ధరలకు నిరసనగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్​లో కాంగ్రెస్​ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు.

Congress Dharna AT Shamshabad
శంషాబాద్​లో కాంగ్రెస్​ శ్రేణుల ధర్నా.. పాల్గొన్న ఉత్తమ్​
author img

By

Published : Jul 4, 2020, 1:38 PM IST

పెట్రో ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్​ నేడు అన్ని మండలాల్లో నిరసనలకు దిగింది. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో కాంగ్రెస్​ శ్రేణులు నిరసన చేపట్టారు. టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌ కుమార్​ రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నాయకులను అడ్డుకుని స్టేషన్​కు తరలించారు.

కరోనాతో ఓవైపు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. కేంద్రం ఇంధన ధరలు పెంచడం అమానవీయ చర్య అని ఉత్తమ్​ మండిపడ్డారు. అంతర్జాతీయ మార్కెట్​లో చమురు ధరలు తగ్గుతుంటే.. పెట్రోల్​ ధరలు పెంచడం ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలవాల్సిన మోదీ ప్రభుత్వం.. ధరలు పెంచి సామాన్య ప్రజలపై అదనపు భారాన్ని మోపుతుందని విమర్శించారు. వెంటనే పెట్రోల్​, డీజిల్​ ధరలను తగ్గించాలని డిమాండ్​ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు.. శంషాబాద్ తహసీల్దార్​కు వినతిపత్రం సమర్పించారు.

శంషాబాద్​లో కాంగ్రెస్​ శ్రేణుల ధర్నా.. పాల్గొన్న ఉత్తమ్​

ఇదీచూడండి: 'మోదీజీ.. దయచేసి లద్దాఖీల మాట వినండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.