రంగారెడ్డి జిల్లా అదిభట్ల ఠాణా పరిధిలోని బొంగ్లూర్ ఔటర్ సర్వీస్ రోడ్డుపై కారులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ పొగలు రావడంతో అందులోని వ్యక్తితో పాటు బయటకు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. నాగోల్ నుంచి ఓ వ్యక్తి క్యాబ్ బుక్ చేసుకుని కొంగరకలాన్ వైపు వెళుతుండగా కారులో పొగలు వ్యాపించాయి. అప్రమత్తమైన డ్రైవర్, కారులో ఉన్న వారిని కిందకి దించేసి.. బానెట్ ఓపెన్ చేయబోతే భారీగా పొగలు వెలువడ్డాయి. అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేసినా ప్రయోజనం లేకపోయింది. ఫైర్ ఇంజన్ వచ్చేలోపే కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఆదిభట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి: సెగలు పుట్టిస్తున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం