వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. రైతులను తప్పుదోవ పాట్టిస్తున్నాయని ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని కేజీఆర్ గార్డెన్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలపై అవగాహన కార్యక్రమానికి లక్ష్మణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
రైతులు పండించిన పంటలను దేశంలో ఎక్కడైనా నేరుగా అమ్ముకోవచ్చని లక్ష్మణ్ వివరించారు. ఈ చట్టాలతో దళారి వ్యవస్థకు చెక్ పెట్టొచ్చన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం అమలుచేయని సంక్షేమ పథకాలను భాజపా సర్కార్ ప్రవేశపెట్టిందన్నారు. ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దని... రైతులకు వ్యవసాయ చట్టాలపై అవగాహన కల్పించాలని లక్ష్మణ్ సూచించారు.