రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గం నాగోల్లో ఆల్ ఇండియా ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాష్ట్రంలోని అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ అమలు చేస్తునట్లు సీఎం ప్రకటించారు. ఆయన నిర్ణయంపై సంఘం ప్రతినిధులు, తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా హర్షం వ్యక్తం చేశారు.
ఈ రిజర్వేషన్.. అర్హులకు ఎంతగానో ఉపయోగపడుతుందని శ్రీనివాస్ గుప్తా అన్నారు. ప్రతినిధులు, మహిళలు తదితరులు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలుపుతూ నినాదాలు చేశారు.
ఇదీ చదవండి: 'తెలంగాణ పవర్ప్లాంట్ రెండో దశకు శంకుస్థాపన అప్పుడే జరగాలి'