రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ వద్ద బాహ్యవలయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది. ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
గచ్చిబౌలి నుంచి బాహ్యవలయ రహదారి మీదుగా పెద్దఅంబర్‌పేట్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి : 'తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ ఉంటారు'