స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారుల పొరపాటు వల్ల రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని అజీజ్ నగర్ గ్రామ ప్రజలకు విచిత్ర పరిస్థితి ఎదురైంది. ఈ నెల 6న జరిగిన తొలివిడత ఎన్నికల్లో కనకమాడి గ్రామానికి చెందిన బ్యాలెట్ పత్రాలు అజీజ్ నగర్‌కు చేరిన విషయం ఎన్నికల సిబ్బంది గమనించలేదు. వాటిపైనే ఆ గ్రామస్థులతో ఓట్లు వేయించారు. తప్పిదాన్ని గుర్తించిన అధికారులు బ్యాలెట్ పత్రాలను సరిచేసి ఇళ్లకు తిరిగి వెళ్లిన 34 మందిని మళ్లీ వెనక్కి పిలిపించి రెండోసారి ఓట్లు వేయించారు.
'మూడు సార్లు ఓట్లేయడంపై గ్రామస్థుల అసంతృప్తి'
పోలింగ్ అనంతరం అజీజ్ నగర్లో జరిగిన ఎన్నికల సంఘం జరిగిన తప్పిదాన్ని గుర్తించి ఎన్నిక చెల్లదని స్పష్టం చేసింది. ఈనెల 14న మూడో విడతలో భాగంగా రీపోలింగ్ జరపాలని ఆదేశించింది. ఒకే ఎన్నికలో మూడుసార్లు ఓటు వేయాల్సి రావడం పట్ల గ్రామస్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
'ఆ ఊర్లో ముచ్చటగా మూడోసారి ఎన్నికలు' - KANAKAMAMIDI VILLAGE
ఒకే గ్రామానికి చెందిన వారు ముచ్చటగా మూడోసారి ఓట్లేసేందుకు సిద్ధమవుతున్న విచిత్ర పరిస్థితి రంగారెడ్డి జిల్లా అజీజ్ నగర్ గ్రామంలో చోటు చేసుకుంది.