వేములవాడ పట్టణ ప్రజల చిరకాల కల నెరవేరనుంది. పట్టణ సమీపంలోని 6 మండలాలలోని 15 రెవెన్యూ గ్రామాలతో కలిపి రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రాథమిక ప్రకటన జారీ చేసింది. ఇప్పటివరకు సిరిసిల్ల రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉండేది. భూ సంబంధిత సమస్యలపై రెవెన్యూ డివిజన్ కార్యాలయానికి వెళ్లేందుకు ఖర్చుతో పాటు సమయం ఎక్కువగానే పడుతుందని స్థానికులు పేర్కొన్నారు.
ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వినతిపత్రం ఇచ్చి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అవశ్యకతను వివరించారు. కాంగ్రెస్, భాజపానాయకులు కూడా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలంటూ పలుమార్లు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
ఇదీ చదవండిః భారీగా ఐఏఎస్‌ల బదిలీలు... కొత్త పోస్టింగ్‌లు ఇవే...