రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పలు దేవాలయాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక పర్వదినం సందర్భంగా భక్తులు పలు ఆలయాలకు పోటెత్తారు. సిరిసిల్లలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు వేకువజాము నుంచే ఆలయాల వద్ద భారీగా వరుసలు కట్టారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల మాదిరిగా దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. అర్ధరాత్రి దాటిన తర్వాత అర్చకులు శాస్త్రోక్తంగా వైకుంఠ ద్వారాన్ని తెరిచారు. వేకువ జామున 3 గంటల నుంచి ప్రముఖుల దర్శనాలు ప్రారంభమయ్యాయి. చాలా మంది ప్రముఖులు వైకుంఠ ద్వార దర్శనానికి హాజరైనట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి తెలిపారు. ఉత్తర ద్వార దర్శనానికి ఉదయం 4 గంటల నుంచి సాధారణ భక్తులకు అనుమతి ఇచ్చారు.
ఇదీ చూడండి: యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో 16 మందికి కరోనా