రాజన్న సిరిసిల్ల జిల్లా మధ్య మానేరు ప్రాజెక్టు కుడివైపు గండి ఏర్పడటం చర్చనీయాంశంగా మారింది. గత నెలలో గోదావరి జలాల ఎత్తిపోతలతో సుమారు 20 టీఎంసీల జలాలు మధ్య మానేరు ప్రాజెక్టులో నిల్వ చేశారు. మొదటిసారి గోదావరి జలాల ఎత్తిపోతలతో ఆగస్టు నెలలో మాన్వాడ వైపు కట్టకు సీపేజ్ ఏర్పడింది.
ప్రాజెక్టు ఎడమవైపు వైపు గల కట్ట అడుగులో సున్నపురాయి ఉండటం వల్ల ఇటీవల మరమ్మతులు పూర్తి చేశారు. రెండోసారి 20 టీఎంసీల నీటిని నిల్వ చేయటం వల్ల రెండోవైపు కట్టకు సీపేజ్ ఏర్పడింది. తాజా పరిణామంతో లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తం అయ్యారు.
ఇవీచూడండి: ఎక్కడైనా ఫిర్యాదు చేయొచ్చు.. జీరో ఎఫ్ఐఆర్ ఉందిగా..!