ETV Bharat / state

నిజాం కాలం నాటి వైభవం నేడేది - గంభీరావుపేట నిజాం కట్టడం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిజాం కాలంలో కట్టిన ఎగువ మానేరు అతిథి గృహం అధ్వానంగా తయారైంది. నాటి వైభవం నేడు కరవైంది. శిథిలావస్థకు చేరుకుంది. పాలకులు మాత్రం పట్టించుకోవటం లేదు.

నిజాం కాలం నాటి కట్టడం వైభవం నేడేది
నిజాం కాలం నాటి కట్టడం వైభవం నేడేది
author img

By

Published : Oct 4, 2020, 11:24 AM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా నర్మాల (గంభీరావుపేట) నిజాం కాలంలో కట్టిన ఎగువ మానేరు అతిథి గృహం అధ్వానం తయారైంది. ఎగువ మానేరును సందర్శించడానికి వచ్చిన వారు అప్పట్లో మానేరు అతిథి గృహాన్ని చూడటానికి వచ్చేవారు. దీని ప్రాంగణంలోని ఖాళీ స్థలం పార్కును తలపించేది. అధికారులు, ప్రజాప్రతినిధులు ఇక్కడికి వచ్చి సేదతీరేవారు.

నాటి వైభవం నేడు కరవైంది. శిథిలావస్థకు చేరుకుంది. పాలకులు మాత్రం పట్టించుకోవటం లేదు. విద్యుత్తు లైన్‌ అధ్వానం ఉంది. ఫ్యాన్లు లేవు. వాటర్‌ ట్యాంక్‌ పని చేయడంలేదు. సోపాలు శిథిలావస్థలో ఉన్నాయి.

వర్షం పడినప్పుడు గోడలు పూర్తిగా తడుస్తున్నాయి. అతిథి గృహంపై గడ్డి మొలిచింది. గతంలో మానేరు అతిథి గృహం నిర్వహణకు, అదేవిధంగా మానేరు కాలువపై లైన్‌ మెన్‌లు మొత్తం కలిసి 60 మంది వరకు సిబ్బంది ఉండేవారు. ప్రస్తుతం ఇద్దరు మాత్రమే పని చేస్తున్నారు. అతిథి గృహాన్ని పర్యవేక్షించడానికి ఒక్కరూ లేరు. ఇటీవలే డివిజన్‌ కార్యాలయం నుంచి అటెండర్‌ను పంపించారు.

పర్యవేక్షణ లేక అధ్వానంగా మారింది. దానిని పునరుద్ధరించడానికి అధికారులు దాదాపు ఐదారు సార్లు ప్రతిపాదనలు పంపించారు. అయినా మోక్షం కలగలేదు. ఇటీవల మళ్లీ రూ. 1.89 కోట్లతో ప్రతిపాదనలను పంపించినట్లు అధికారులు తెలిపారు. అప్పట్లో మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావులు మానేరు అతిథి గృహాన్ని సందర్శించిన సమయంలో పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు. నేటికీ పైసా కూడా కేటాయించలేదు. మండల ప్రజాప్రతినిధులు స్పందించి మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి మరమ్మతులు చేయించాలని ఈ ప్రాంతీయులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: పోకిరీలపై కొరడా కొరడా ఝుళిపింటి షీ టీం బృందాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.