ETV Bharat / state

నిర్మానుష్యంగా మారిన వేములవాడ... రాజన్న ఆలయంలో కోడె మొక్కులు రద్దు

కరోనా వైరస్ వ్యాప్తితో చాలా వరకు ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. జనం బయటకు రాకపోవడం సెల్ఫ్ లాక్డౌన్ చేసుకోవడం వల్ల వేములవాడ పట్టణంలోని రహదారులు, పురవీధులు అన్ని నిర్మానుష్యంగా మారాయి. భక్తులు లేక వేములవాడ రాజన్న ఆలయం వెలవెలబోతోంది. వైరస్​ వేగంగా విస్తరిస్తుండడం వల్ల కోడె మొక్కులను అధికారులు నిలిపివేశారు.

self lockdown in vemulawada
నిర్మానుష్యంగా మారిన వేములవాడ
author img

By

Published : May 6, 2021, 7:36 PM IST

రాజన్న ఆలయంలో కోడె మొక్కులు రద్దు

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ పరిసర ప్రాంతాలతో పాటు, పట్టణంలోని వ్యాపారస్తులు, పట్టణ ప్రజలు స్వచ్ఛందంగా లాక్ డౌన్ విధించడంతో పట్టణంలోని పురవీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఉదయం 6 గంటల నుంచి రెండు గంటల వరకే దుకాణాలు తెరిచి ఉంచడం, రెండు గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు దుకాణాలు మూసి వేయడంతో వేములవాడ పట్టణంలోని ఆలయ ప్రాంతంతో పాటు, వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. జిల్లాలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. వైరస్ వ్యాప్తితో భయానికి గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు.

కోడె మొక్కులు నిలిపివేత

భక్తులు లేక వేములవాడ రాజన్న ఆలయం వెలవెలబోతోంది. మరోపక్క... ఆలయంలో కోడెమొక్కుల సేవలను అధికారులు నిలిపివేశారు. కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతుండటంతో దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గుతోంది. ఆలయంలో ఉదయం 7నుంచి సాయంత్రం 7వరకు సాధారణ దర్శనాలు మాత్రమే కొనసాగుతున్నాయి. మార్చి 31న శివకళ్యాణం సమయంలో భక్తులు లక్షల సంఖ్యలో పాల్గొనడం పలు విమర్శలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలో ఆలయంలో శ్రీరామనవమి వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. ఇప్పటికే ఆలయ ఉద్యోగులు పలువురు కరోనా బారిన పడి మృత్యువాత పడగా మరికొందరు చికిత్స పొందుతున్నారు. వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో దర్శనాలకు వచ్చే భక్తుల నుంచి.... కోడెలను దూరంగా ఉంచేందుకు కోడె మొక్కులను రద్దు చేశారు.

ఇదీ చదవండి: కరోనా పరిస్థితులపై అధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.