ETV Bharat / state

రాజన్న ఆలయం హుండీ లెక్కింపు - వేములవాడ రాజన్న ఆలయ హుండీ లెక్కింపు తాజా వార్త

రాజన్న ఆలయం హుండీ లెక్కించారు. గత 14రోజుల్లో సుమారు రూ.78.85లక్షల నగదు, 124 గ్రాముల బంగారాన్ని భక్తులు స్వామివారికి సమర్పించుకున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు.

rajanna temple hundi count at vemulawada in rajanna sircilla district
రాజన్న ఆలయం హుండీ లెక్కింపు
author img

By

Published : Nov 3, 2020, 9:08 PM IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు చేపట్టారు. గత 14 రోజుల హుండీ డబ్బులను లెక్కించారు.

నగదు రూ.78. 85 లక్షలు, బంగారం 124 గ్రాములు, వెండి 6 కిలోల 500 గ్రాములను భక్తులు స్వామివారికి సమర్పించుకున్నారు. హుండీ కానుకల లెక్కింపు కోసం ఓపెన్ స్లాబ్​లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ కృష్ణప్రసాద్, సత్యసాయి సేవాసమితి భక్తులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: తిరుమలలో సర్వదర్శనం టికెట్ల కోసం తోపులాట.. భక్తులకు గాయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.