పోలీసులతోనే సమాజంలో శాంతియుత వాతావరణం నెలకొందని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అన్నారు. అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట వద్ద ఏర్పాటు చేసిన పోలీసు శాంతి స్థూపం వద్ద జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే, పోలీస్ అధికారులతో కలిసి ఆయన నివాళులర్పించారు.
నాటి పోలీసుల త్యాగ ఫలితంగానే నేడు శాంతియుత వాతావరణం నెలకొని ఉందన్నారు. పోలీస్ అమరవీరుల త్యాగం వృథా కాదన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామని జిల్లా ఎస్పీ రాహుల్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'ప్రజా సంరక్షణకు ప్రాణాలు సైతం లెక్కచేయని యోధులు పోలీసులు'