ఉపాధి హామీ పనులు చేపట్టేప్పుడు విధిగా కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. జలహితం కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని నర్మాల ప్రాజెక్టు కాల్వల పూడికతీత పనుల్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కొల్లమద్ది గ్రామంలో ఎగువ మానేరు ఫీడర్ ఛానెల్‌లో పూడిక తీత పనులు సాగనున్నాయి.
అనంతరం నర్మాల గ్రామంలో మానేరు వాగుపై నిర్మించనున్న రెండు చెక్డ్యామ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. రోజుకు ఏమేర కూలీ గిట్టుబాటు అవుతుందో అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం కరోనా కాలం నడుస్తోందని... ముఖానికి తప్పకుండా మాస్కులు పెట్టుకోవాలని సూచించారు. కరోనా సోకినా.. ఆందోళన చెందవద్దని చెప్పారు. ఈ పూడికతీత పనులు పూర్తి అయితే వ్యవసాయానికి సాఫీగా నీరందుతాయని హామీ ఇచ్చారు.
ఉపాధి హామీ పథకం నిధుల్ని వ్యూహాత్మకంగా ఉపయోగించుకోవడంలో భాగంగా నీటిపారుదల శాఖ జలహితం కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా మొత్తం 1231 కోట్ల రూపాయలతో నిధులతో కాల్వలు, డిస్టిబ్యూటరీల్లో పూడికతీత, జంగల్ క్లియరెన్స్ వంటి పనుల్ని చేపట్టనున్నారు.