KTR In Siricilla: తెలంగాణ పథకాలు దేశానికే సరికొత్త పంథాను నిర్దేశిస్తున్నాయని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సిరిసిల్ల అమరవీరుల స్తూపం వద్ద కేటీఆర్... నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. గూడులేని పేదవారందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని మంత్రి తెలిపారు. అన్ని సౌకర్యాలతో నిర్మితమైన డబుల్ బెడ్రూం ఇళ్లు పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తున్నాయన్నారు. ఇళ్లు నిర్మించుకునే పేదలకు రూ.3లక్షల ఆర్థిక సాయాన్ని ఈ ఆర్థిక సంవత్సరం నుంచి అందజేస్తామని బడ్జెట్లో ప్రకటించినట్లు కేటీఆర్ వెల్లడించారు. 10 వేల మందికి ఉపాధిని ఇచ్చేలా మధ్య మానేరులో అతిపెద్ద ఆక్వాహబ్ నిర్మాణాన్ని చేపడుతున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో నీటి విప్లవం వచ్చిందని ఈ సందర్భంగా తెలిపారు.
సిరిసిల్ల మహిళల కోసం అపెరల్ పార్కు ప్రారంభించాం. సిరిసిల్ల మహిళలకు శిక్షణ ఇచ్చి కుట్టుమిషన్లు అందించాం. సిరిసిల్ల యువతకు డ్రైవింగ్‌లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాం. గూడులేని పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తాం. ఇళ్లు నిర్మించుకునే పేదలకు రూ.3లక్షల ఆర్థిక సాయాన్ని ఈ ఆర్థిక సంవత్సరం నుంచి అందజేస్తామని బడ్జెట్లో ప్రకటించాం. దానిని కూడా త్వరలోనే అమలు చేస్తాం. -- కేటీఆర్, మంత్రి
ఇవీ చదవండి:
Telangana Formation Day 2022: రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..