సిరిసిల్ల పట్టణం గీతానగర్‌లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అత్యాధునిక వసతులతో, అద్భుతంగా తీర్చిదిద్దారు. రాష్ట్రంలోనే తొలిసారిగా సీఎస్ఆర్ నిధులతో... ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య నిధులను వెచ్చించి వసతులను మెరుగుపరిచారు. రూ.3 కోట్లు వెచ్చించి కార్పొరేట్‌స్థాయి సదుపాయాలకు దీటుగా నిర్మించారు. వెయ్యి మంది విద్యనభ్యసించేలా 20తరగతి గదులు, డిజిటల్ గ్రంథాలయం, 32 కంప్యూటర్లకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందుబాటులో ఉంచారు.
ఒక్కో విద్యార్థిపైనా లక్షకు పైగా ఖర్చు చేస్తున్నాం
ఇప్పటి వరకు ఎన్ని అభివృద్ధి పనులు చేపట్టినా... ఈ పాఠశాల పునర్నిర్మాణం అంత్యంత సంతృప్తినిచ్చింది. ప్రపంచమంతా కరోనాతో ఇబ్బందిపడుతున్న సమయంలో సీఎస్ఆర్ నిధులతో పాఠశాలను పునర్నిర్మించుకోవడం సంతోషకరం. రాష్ట్ర వ్యాప్తంగా 940 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి.. ఒక్కో విద్యార్థికి రూ.1.20 లక్షల చొప్పున ఖర్చు చేస్తున్నాం. విదేశాల్లో చదువుతున్న వారికి రూ.20లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తుంది తెలంగాణ ప్రభుత్వం మాత్రమే.. కార్పొరేట్ పాఠశాలను తలపించేలా 3 కోట్ల వ్యయంతో సదుపాయాలు కల్పించారు. దివీస్‌ల్యాబరేటరీ వారు ముందుకు వచ్చినట్లుగా మరికొంత మంది దాతలు, ప్రజాప్రతినిధులు మిగతా పాఠశాలలను తీర్చిదిద్దాలి. పాఠశాల పునర్నిర్మాణంతో మాబాధ్యత అయిపోయింది.. దీనిని సంరక్షించుకోవాల్సింది మీరే.. కె.తారకరామారావు, పురపాలక శాఖ మంత్రి
ఇదీ చూడండి: ఇలా ఉంటే బడి.. అస్సలు మానాలనిపించదు మరి..